వందయాప్‌లు.. రూ.21 వేల కోట్లు

84చూసినవారు
వందయాప్‌లు.. రూ.21 వేల కోట్లు
రూపాయి రుణం ఇచ్చి పది రూపాయలు వసూలు చేస్తుండటంతో ఈ వ్యాపారం రూ.వేల కోట్లకు చేరింది. హైదరాబాద్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డిపార్ట్‌మెంట్‌ విభాగమే దాదాపు వంద రుణయాప్‌లపై దర్యాప్తు జరుపుతోంది. వీటి ద్వారా జరిగిన బ్యాంకు లావాదేవీల విలువ రూ.21వేల కోట్లు అంటే ఈ దందా ఏ స్థాయిలో జరుగుతోందో అర్థం చేసుకోవచ్చు. ఇందులో చైనాకు చెందిన డోకీపే అనే యాప్‌ ఒక్కటే అసలు, వడ్డీ కలిపి రూ.1,268 కోట్లు వసూలు చేసినట్లు ఈడీ గుర్తించింది.

సంబంధిత పోస్ట్