దుష్టసంకల్పాలు, దుర్గుణాలు లేని ఇల్లాలు చారుమతి. ఆమె భర్తను దైవంగా భావిస్తూ, అత్తమామలను భక్తి శ్రద్ధలతో సేపిస్తూ.. మంచి ప్రవర్తనతో మెలిగేది. ఆమె కలలో శ్రీమహాలక్ష్మీ కనిపించి.. శ్రావణ మాసంలో పౌర్ణమికి ముందు శుక్రవారం తనను పూజించాలని చెబుతూ, వ్రత విధి విధానాలను తెలియజేసింది. ఆ శుభదినం రోజున చారుమతి ఇంట్లో.. చాలా మంది మహిళలు వరలక్ష్మీ వ్రతాన్ని ఆచరించారు. వాయనాలను ఇచ్చిపుచ్చుకున్నారు. పెద్దల ఆశీస్సులు అందుకున్నారు. దీంతో శ్రీ వరలక్ష్మీ అనుగ్రహం పొందారు.