సోషల్ మీడియా పుణ్యమాని చిత్ర విచిత్ర వీడియోలు బయటకు వస్తున్నాయి. తాజాగా ఓ వ్యక్తి రెండు బైకులతో ఓ విచిత్ర వాహనాన్ని తయారు చేశాడు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఈ వీడియోలో ఓ విచిత్ర వాహనంపై ఓ వ్యక్తి ప్రయాణిస్తున్నాడు. కింద రెండు బైక్‌లను అమర్చి నాలుగు చక్రాల వాహనంగా మార్చాడు. ఆ రెండింటినీ అనుసంధానం చేస్తూ పైన ఓ ఐరన్ ఫ్రేమ్ బిగించాడు. దానిపైన స్టీరింగ్ పెట్టి చక్కగా నడుపుతున్నాడు.