గౌతమ్ తో కలిసి రిషీ మీదే సెటైర్లు వేసిన వసుధార

13824చూసినవారు
గౌతమ్ తో కలిసి రిషీ మీదే సెటైర్లు వేసిన వసుధార
గుప్పెడంత మనసు ఈరోజు ఎపిసోడ్ లో ఆరోజు రాత్రి రిషీ వసూ మెసేజ్ కోసం వెయిట్ చేస్తూ ఉదయం రెస్టారెంట్ లో జరిగింది తలుచుకుంటూ ఉంటాడు. తన సారీల కోసం నేను వెయిట్ చేయటం ఎందుకు నేనే ఫోన్ చేసి క్లాస్ ఇస్తాను అని కాల్ చేస్తాడు. జగతి ముందే వసూ ఫోన్ స్విచ్ఛ్ ఆఫ్ చేసిందిగా ఫోన్ చేసి తిడతాననని తెలిసి స్విచ్ఛ్ ఆఫ్ చేసినట్లు ఉంది. ఈ తెలివితేటలకు ఏం తక్కువ లేదు అనుకుంటాడు. తెల్లారుతుంది. వసూ, పుష్పా కాలేజ్ కి వస్తూ ఉంటారు. పుష్పా ఏం మాట్లాడినా వసూ సమాధానం ఇవ్వదు. ఎదురుగా రిషీ ఉంటాడు. రిషీ ఒక్కసారి నా క్యాబిన్ లోకి రా అని వెళ్తాడు. పుష్పా రిషీ సార్ కోపంగా కనపిస్తున్నారు కదా అంటే ఆయనగారు కోపంగా ఎప్పుడు లేరు చెప్పు అంటుంది. అది రిషీ వింటాడు. వచ్చేప్పుడు క్యాబిన్ కి జగతి మేడమ్ ని కూడా తీసుకురా అంటాడు. వసూ మనసులో క్యాబిన్ కి రమ్మన్నారంటే నిన్న జరిగిందానికి ఇప్పుడు విచారణ మొదలుపెడతారేమో అనుకుంటాడు. కట్ చేస్తే గౌతమ్ ఓ రేంజ్ లో కాలేజ్ కి ఎంట్రీ ఇస్తాడు. అక్కడున్న పూలమొక్కలు చూసి ఒక పూవు కోయబోతాడు. ఇంతలో అంటెండర్ వచ్చి ఇక్కడ పూలు తెంపకూడదు అంటాడు. సరే అని మీ ఎండీగారి క్యాబిన్ ఎక్కడ అని అటెండర్ కలిసి వెళ్తాడు.

మరోపక్క వసూ రిషీ రమ్మన్నది జగతి, మహేంద్రకు చెప్తుంది. వసూ మీరు ఉండండి మేడమ్ నేను వెళ్తాను అంటుంది. జగతి గొడవపడతావా అంటే తిట్టడానికి ఆయన సిద్దంగా ఉంటే ఎదుర్కోవాలి అంతే అని. ఆయన విన్నా వినకున్నా నేను చెప్పే వస్తాను అని వెళ్తుంది. గౌతమ్ గోస్ట్ మాస్క్ వేసుకుని రిషీని భయపెడదామనుకుంటాడు. కానీ మనోడు కనిపెట్టి గౌతమ్ రారా ఇడియట్ అంటాడు. దీన్ని బట్టి వీళ్లు క్లోస్ ఫ్రెండ్స్ లా ఉన్నారు. సరదాగా కబుర్లు చెప్పుకుంటూ రిషీకోసం ఉన్న కాఫీ తాగి ఈ కాఫీ నాకు రాసిపెట్టిఉంది నేను తాగాలి అని తాగుతాడు. అలా మాట్లాడుకుంటూ రిషీ ఉంటావా వెళ్తావా అంటే సరదాగా కొన్నిరోజులు ఉండి వెళ్దాం అని వచ్చాను కానీ ఒక యాక్సిడెంట్ నన్ను ఉండేలా చేసింది అని నిన్న జరిగిన యాక్సిడెంట్ గురించి వసూ గురించి చెప్తాడు. ఆ అమ్మాయి ఉంది. మామూలుగా లేదురా అంటాడు. నువ్వు ఇంకా మారలేదురా అని రిషీ ఈ అమ్మాయి అందరిలాంటిది కాదురా, తన మనసు చాలా మంచిదిరా, తన లుక్స్ లో కాన్ఫిడెన్స్ ఉందిరా, ధైర్యం ఉన్నఅమ్మాయి, తన చిరునవ్వు ఉందిరా. కవితలు కాదు, కావ్యంరాసేయొచ్చు..ఆ అమ్మాయికోసం ఉంటాను అని గౌతమ్ అంటే నీ సంగతి నాకు తెలియదా, ప్రతిసారి ఇలానే అంటావ్ అంటాడు. గౌతమ్ నేను ఈ అమ్మాయిని సీరియస్ గా తీసుకున్నాను. నువ్వు హెల్ప్ చేయాలిరా అంటే..ఆ అమ్మాయి నీకురాసిపెట్టి ఉంటే నీకే దక్కుతుంది అంటాడు. దూరం నుంచి వసూరావటం చూసి అటెండర్ అరగంట వరకూ ఎవర్నీ పంపొద్దు అంటాడు. అదే విషయం వసూకి అటెండర్ చెప్తాడు. కావాలనే నన్ను వెనక్కు పంపిస్తున్నారేమో అనుకని వసూ వెనక్కు వెళ్తుంది.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్