వీడేంట్రా బాబు..! మొసళ్లతో ఈత కొడుతున్నాడు..(షాకింగ్ వీడియో)

554చూసినవారు
మొసళ్లు.. యమ డేంజరస్‌.. అందులో నీటిలో ఉన్నప్పుడు మొసళ్లను మించిందేది లేదంటున్నారు. పొరపాటున మొసళ్లు ఉన్న నీటి దగ్గరకు వెళ్లామా అంతే సంగతులు. అయితే మొసళ్లు ఉన్న కొలనులో ఈత కొడుతున్న బాలుడిని ఎప్పుడైనా చూశారా..? అలాంటి ఓ వీడియో సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోలో మొసళ్లు ఉన్న కొలనులోకి ఓ బాలుడు ఏదో స్విమ్మింగ్ ఫుల్‌లో ఏదీ లేనట్లే దూకి.. స్వీమ్ చేశాడు. కానీ, ఈ వీడియో చూస్తున్న నెటిజన్లు బాలుడికి ఏమౌతుందో అని భయపడ్డారు.