ఏపీ పౌరసరఫరాల శాఖలో భారీ కుంభకోణం

19183చూసినవారు
ఏపీ పౌరసరఫరాల శాఖలో భారీ కుంభకోణం
ఏపీ పౌరసరఫరాల శాఖలో భారీ కుంభకోణం జరిగింది. మంత్రి మనోహర్ ఆదేశాలతో మంగళవారం అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో భారీ కుంభకోణం జరిగినట్లు గుర్తించారు. 52 స్టాక్ పాయింట్లలో తనిఖీలు నిర్వహించగా.. 24 చోట్ల అక్రమాలు బయటపడ్డాయి. పంచదార, ఫామాయిల్, కందిపప్పు సరఫరాలో భారీ అవినీతి జరిగింది. అరకేజీ కందిపప్పు ప్యాకెట్‌లో 50-80 గ్రాములు, కేజీ పంచదారలో 100 గ్రాములు, లీటర్ ఫామాయిల్‌లో 100 మి.లీటర్లు తక్కువగా ప్యాకింగ్ చేసినట్లు గుర్తించారు.

సంబంధిత పోస్ట్