ఆహార ద్రవ్యోల్బణమే దెబ్బకొడుతోంది: RBI గవర్నర్

75చూసినవారు
ఆహార ద్రవ్యోల్బణమే దెబ్బకొడుతోంది: RBI గవర్నర్
రిటైల్ ద్రవ్యోల్బణాన్ని అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నామని, అయితే ఆహార ధరలు పెరగడం సవాల్‌గా మారుతుందని ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ అన్నారు. సరఫరా కొరత కారణంగా ధరలపైనా ప్రభావం చూపుతోందన్నారు. అభివృద్ధి చెందిన దేశాల్లోనూ ద్రవ్యోల్బణం సవాల్‌గా మారిందని పేర్కొన్నారు. గత ఏడు నెలల్లో ఆహార ద్రవ్యోల్బణం సగటున 8 శాతంగా నమోదైందని ఆయన చెప్పారు. కాగా, రిటైల్ ద్రవ్యోల్బణం ప్రస్తుతం 4.75 శాతంగా ఉంది.

సంబంధిత పోస్ట్