ఒడిశాలోని భువనేశ్వర్‌లో శుక్రవారం ఘోరప్రమాదం తప్పింది. లింగరాజ్ స్టేషన్‌లో ఒకే లైన్‌లో నాలుగు రైళ్లు వచ్చాయి. రైల్వే ట్రాక్‌పై వరుసగా 4 రైళ్లు నిలిచి ఉన్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అదృష్టవశాత్తూ ఆ రైళ్లు నెమ్మదిగా రావడంతో ప్రమాదం జరగలేదు. దీనిపై రైల్వే అధికారులు విచారణ ప్రారంభించారు. ఇక ఒడిశాలో తరచూ రైలు ప్రమాదాలు జరుగుతున్నాయి. బాలేశ్వర్ వద్ద రైలు ప్రమాదంలో 296 మంది గతంలో చనిపోయారు.