టీమ్ ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మతో ఓ అభిమాని చేసిన సంభాషణ వైరల్ అవుతోంది. నెట్స్లో ప్రాక్టీస్ చేసి వెళ్తున్న రోహితన్ను ఓ యువతి ఆటోగ్రాఫ్ కోసం పిలిచింది. ఆయన వచ్చి ఆటోగ్రాఫ్ చేయగానే థాంక్స్ చెప్పింది. అయితే, ఆ వెంటనే విరాట్ కోహ్లి ఫ్యాన్ ఇక్కడకు వచ్చిందని ఆయనకు చెప్పండి ప్లీజ్ అని కోరింది. దీంతో రోహిత్ నవ్వుతూ విరాట్కు చెబుతానని జవాబిచ్చారు.