కేన్-బేట్వా నదీ అనుసంధానం ప్రాజెక్టుకు ప్రధాని మోదీ శంకుస్థాపన చేశారు. మధ్యప్రదేశ్‌లోని ఖజురహోలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఖాండ్వా జిల్లాలో ఏర్పాటు చేసిన ఓంకారేశ్వర్ ఫ్లోటింగ్ సోలార్ ప్రాజెక్టును కూడా ఆయన వర్చువల్‌గా ప్రారంభించారు. కేంద్ర జలవనరుల మంత్రి సీఆర్ పాటిల్, మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.