VIDEO: పెళ్లిలో ఫోక్ సాంగ్‌కు కొత్త జంట స్టెప్పులు

1879చూసినవారు
ప్రస్తుతం జరుగుతున్న వివాహ వేడుకలలో వధూవరులు డ్యాన్స్ చేయడం ట్రెండ్‌గా మారింది. ఇదే కోవలో తెలంగాణలోని జగిత్యాలలో తాజాగా జరిగిన ఓ వివాహ వేడుకలో వధూవరులు డ్యాన్స్ చేశారు. 'శనగ చేలో నిలబడి చేతులు ఇయ్యవే' అనే ఫోక్ సాంగ్‌కు ఉత్సాహంగా స్టెప్పులు వేశారు. వరుడితో పోటీ పడుతూ డ్యాన్స్ చేసి వధువు ఆకట్టుకుంది. బంధువులు వారిని ఉత్సాహపరిచారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్