BRS వైపు విజయశాంతి అడుగులు..?

33037చూసినవారు
BRS వైపు విజయశాంతి అడుగులు..?
తెలంగాణలో కాంగ్రెస్ నేత విజయశాంతి చేసిన ట్వీట్ చర్చనీయాంశంగా మారింది. BRSని ఉద్దేశించి BJP రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలకు ఆమె స్పందించారు. 'తెలంగాణలో BRS అనే పార్టీ ఇక ఉండదు అని అంటున్న కిషన్ రెడ్డి అభిప్రాయం సమంజసం కాదు. ప్రాంతీయ భావోద్వేగాలు ప్రజా మనోభావాలను వారి ఆత్మాభిమానం వైపు నడిపిస్తూనే వస్తుండడం దక్షిణాది రాష్ట్రాల సహజ విధానం' అని ట్వీట్ చేశారు. దీంతో ఆమె త్వ‌ర‌లోనే BRSలో చేరబోతున్నార‌న్న ఊహాగానాలు ఊపందుకున్నాయి.

సంబంధిత పోస్ట్