వికారాబాద్ జిల్లా లగచర్ల గ్రామంలో అధికారులపై జరిగిన దాడి ఘటనలో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. నిందితుడిగా అనుమానిస్తున్న సురేశ్ అనే వ్యక్తి కాల్ డేటాను పోలీసులు పరిశీలించారు. ఇతను 42సార్లు మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డితో ఫోన్‌లో మాట్లాడినట్లు గుర్తించారు. నిందితుడి కోసం నాలుగు బృందాలు గాలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. నిన్న ఔషధ పరిశ్రమ భూసేకరణ కోసం కలెక్టర్, అధికారులు వెళ్లగా గ్రామస్థులు దాడి చేసిన విషయం తెలిసిందే.