వికారాబాద్ జిల్లా కొడంగల్ మండలం పెద్ద నందిగామ గ్రామంలో మంగళవారం ఉదయం మూగ బాలుడు మహేష్(12) విద్యుత్ షాక్ కు గురయ్యాడు. వెంటనే గమనించిన స్థానికులు ఆసుపత్రికి తరలించారు. మహేష్ తన ఇంటి ముందు ఉన్న ట్రాన్స్ఫార్మర్ కు ప్రమాదవశాత్తు తగలడంతో ఈ ప్రమాదం జరిగింది. రక్షణ వలయం లేకుండా ఏర్పాటు చేసిన ట్రాన్స్ ఫార్మర్ తొలగించాలని పలుమార్లు అధికారులకు విన్నవించినా పట్టించుకోలేదని క్షతగాత్రుని తండ్రి ఆరోపిస్తున్నాడు.