
పెద్దేముల్ మండలంలో హత్య
వికారాబాద్ జిల్లా పెద్దేముల్ మండలంలోని హన్మాపూర్ గ్రామంలో బుధవారం తెల్లవారుజామున హత్య జరిగింది. గ్రామానికి చెందిన బక్కని వెంకటేష్ ను హత్య చేసినట్లు తెలుస్తోంది. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని విచారణ చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. హన్మాపూర్ వరుస హత్యలు కలవర పెడుతున్నాయి.