AP: వైసీపీ సభ్యుల తీరుపై స్పీకర్ అయ్యన్నపాత్రుడు అసహనం వ్యక్తం చేశారు. వైసీపీ సభ్యులు దొంగచాటుగా వచ్చి.. అటెండెన్స్ రిజిస్టర్‌లో సంతకాలు పెడుతున్నారని మండిపడ్డారు. ప్రశ్నలు వేస్తున్నారే తప్ప సభకు రావడం లేదని తెలిపారు. 'దొంగచాటుగా వచ్చి సంతకాలు పెట్టి వెళ్లిపోవడమేంటి.. సంతకాలు పెట్టిన వైసీపీ సభ్యులు నాకు సభలో కనపడలేదు. సంతకాల కోసమే వస్తున్నారా. ఎన్నికైన సభ్యులు సగర్వంగా సభకు రావాలి' అని స్పీకర్ ఫైర్ అయ్యారు.