వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలోని గంజ్ లో శుక్రవారం జరిగిన రేణుక ఎల్లమ్మ జాతర ఉత్సవాల్లో తాండూరు నియోజకవర్గ మహిళా కన్వీనర్ శకుంతలా తో కలిసి జడ్పీటీసీ ప్రమోదిని పాల్గొన్నారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. అమ్మవారి అశీస్సులతో ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని ఆమె కోరుకున్నారు. అమ్మవారిని దర్శించుకున్న ఆమెకు ఆలయ నిర్వాహకులు సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.