ఉత్తరప్రదేశ్‌లోని లక్నోలో సాధువులుగా నటిస్తూ ప్రజల విలువైన వస్తువులు, డబ్బును దోచుకుంటున్న నలుగురు యువకులను గ్రామస్థులు దారుణంగా కొట్టారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తీవ్రంగా కొట్టిన తర్వాత వారిని పోలీసులకు అప్పగించారు. నలుగురు యువకులు సాధువులు వేషధారణలో వచ్చి ఓ దుకాణాదారుడిని మత్తు ఇచ్చారు. అతడు స్పృహ తప్పి పడిపోయిన తర్వాత, దుకాణంలోని మూడు బస్తాల ఆవాలు, నగదును దొంగిలించి పారిపోయారు.