మద్యం దుకాణం సిబ్బంది నిర్లక్ష్యంతో ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయిన ఘటన హైదరాబాద్ లోని నాచారంలో జరిగింది. కనకదుర్గ వైన్స్ కు వచ్చిన నాగి అనే వ్యక్తి మద్యం తాగి అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. దీంతో వైన్స్ సిబ్బంది అతడిని బయట పడేశారు. అనంతరం అతను మృతిచెందాడు. దీంతో అతని భార్య, బంధువులు వైన్స్ ఎదుట ఆందోళనకు దిగారు. అనంతరం వైన్స్ లోకి వెళ్లి మద్యం బాటిళ్లను ధ్వంసం చేశారు. ఈ ఘటన సోమవారం రాత్రి జరిగింది.