భూపాలపల్లి పలిమెల మండలంలోని కామన్ పల్లి-ముకునూర్ రహదారి మధ్యలో కిష్టాపురం వద్ద పెద్దపులి సంచరిస్తూ కనిపించింది. పలిమెలకు చెందిన ఓ వ్యక్తి ఆ దారిలో కారులో ప్రయాణిస్తుండగా పులి రహదారి తిష్ఠ వేసి అక్కడే ఉంది. పులి కనిపించడంతో అతను ఒక్క సారిగా భయాందోళనకు గురయ్యానని మంగళవారం ప్రత్యక్ష సాక్షి తెలిపారు. ఇదే ప్రాంతంలో రెండేళ్ల క్రితం పులి సంచరించి పశుపుల పై దాడిచేసి చంపేసింది.