భారతీయ జనతా పార్టీ భూపాలపల్లి అర్బన్ అధ్యక్షులు సామల మధుసూదన్ గారి ఆధ్వర్యంలో పత్రిక సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో సామల మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు కరీంనగర్ పార్లమెంటు సభ్యులు గౌరవనీయులు పెద్దలు, బండి సంజయ్ కుమార్ మూడవ విడత ప్రజా సంగ్రామ యాత్ర ముగింపు సందర్భంగా వరంగల్ లో బహిరంగ సభను ఏర్పాటు చేయడం జరుగుతున్నది ఈ సభకు ముఖ్య అతిథిగా జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా గారు హాజరై తెలంగాణలో ఉన్నటువంటి సమస్యల పైన ప్రసంగించడం జరుగుతుంది.
కావున భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యులందరూ మహిళామూర్తులు అభిమానులు అనుబంధ సంఘాలు సానుభూతిపరులు కార్మికులు యువకులు నిరుద్యోగులు ముఖ్యంగా దేశానికి అన్నం పెట్టే రైతన్నలు ఈ సభను విజయవంతం చేయవలసిందిగా భూపాలపల్లి బిజెపి నాయకులందరినీ కోరడం జరిగింది కావున ప్రతి ఒక్క కార్యకర్త ఒక సైనికుడిలా ఈ సభను విజయవంతం చేసి బిజెపి తెలంగాణ రాష్ట్ర ప్రజల్లో చైతన్యం తేవాలని భారతీయ జనతా పార్టీ భూపాలపల్లి అర్బన్ శాఖ తరపున ప్రతి ఒక్కరిని పేరుపేరునా విజ్ఞప్తి చేస్తున్నాం అని మధుసూదన్ రెడ్డి అన్నారు ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ భూపాలపల్లి అర్బన్ ప్రధాన కార్యదర్శి తుమ్మేటి రామ్ రెడ్డి ఉపాధ్యక్షులు కోరె సుధాకర్ పడకంటి పురుషోత్తం తోట ఓదెలు డాక్టర్ సెల్ అధ్యక్షులు కర్ర జైపాల్ రెడ్డి గారు రమేష్ తదితరులు పాల్గొనడం జరిగింది.