జయశంకర్ భూపాలపల్లి జిల్లా మల్హర్ రావు మండలంలోని కొయ్యూరు గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్న నాగులమ్మ ఆలయ ఆవరణంలో జయశంకర్ భూపాలపల్లి జిల్లా టియూడబ్యూజే (ఐజేయూ)కోశాధికారి చింతల కుమార్ యాదవ్ ఆధ్వర్యంలో మంగళవారం మండల ప్రెస్ క్లబ్ కార్యవర్గ నూతన కార్యవర్గం ఏకగ్రీవంగా ఎన్నికయ్యింది. గౌరవ అధ్యక్షునిగా చింతల కుమార్ యాదవ్, అధ్యక్షునిగా ముడితనపెల్లి ప్రభాకర్ (వార్త) ఉపాధ్యక్షుడిగా బుర్ర సుధాకర్ (ప్రత్యక్ష సాక్షి), ప్రదాన కార్యదర్శిగా శనిగల లక్ష్మణ్ (మెట్రో) కోశాధికారిగా ఊట్నూరి శ్రావణ్ (జనంసాక్షి) కార్యదర్శిగా రాగం కుమార్, కార్యవర్గ సభ్యులుగా చొప్పరి రాజు(సూర్య దినపత్రిక) , మల్కా కార్తీక్ రావు(ప్రజా దర్బార్) ఐత వినయ్(తెలంగాణ వాణి) ఎన్నికయ్యారు.