జపాన్ ఓపెన్ ప్రపంచ టూర్ సూపర్ 500టోర్నీలో భారత స్టార్ షట్లర్ పి.వి.సింధు పోరాటం ముగిసింది. గురువారం మహిళల సింగిల్స్ ప్రిక్వార్టర్ఫైనల్లో సింధు 21-17, 16-21, 17-21తో మిచెల్ లీ (కెనడా) చేతిలో పోరాడి ఓడింది. మిచెల్‌పై 10-4తో మెరుగైన గెలుపోటముల రికార్డున్న సింధు.. ఈ మ్యాచ్‌లో తడబడింది. తొలి గేమ్‌ను సాధికారికంగా సొంతం చేసుకున్న ఆమెకు రెండు, మూడో గేమ్ల్లోతడబడింది.