ఏపీలో బాలికపై అత్యాచార ఘటనలో వైసీపీ నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు. కర్నూల్ జిల్లా కోసిగి మండలానికి చెందిన వైసీపీ సర్పంచ్ దాదలం బోయ ఉసేని, అతని అనుచరులు బోయ తోవి వినోద్, బోయ మజ్జిగ సూర్యనారాయణ ఎనిమిదో తరగతి చదువుతున్న బాలికపై అత్యాచారయత్నానానికి పాల్పడ్డారు. వీరిపై కోసంగి పోలీసులు పోక్సో కేసు నమోదు చేసి.. కోర్టులో ప్రవేశపెట్టారు. నిందితులకు కోర్టు 14 రోజులు రిమాండ్ విధించింది.