73 వ గణతంత్ర వేడుకలు బుధవారం భారతీయ జనతాపార్టీ భూపాలపల్లి పట్టణ శాఖ ప్రధాన కార్యదర్శి తుమ్మేటి రామ్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పట్టణ అధ్యక్షులు సామల మధుసూదన్ రెడ్డి హాజరై త్రివర్ణ పతాకం ఎగురవేసి అనంతరం ఆయన మాట్లాడుతూ స్వాతంత్రం కోసం నేతజీ సుభాష్ చంద్ర బోస్ భగత్ సింగ్ అల్లూరి సీతారామరాజు లాంటి ఎందరో మహానీయులు ప్రాణ త్యాగాలు చేసారు వారి త్యాగాల ఫలితంగా భారత దేశానికి ఈరోజు స్వాతంత్రం వచ్చింది.
స్వాతంత్రానంతరం భారత దేశానికంటు ఒక రాజ్యాంగం ఉండాలని డా. బి. అర్. అంబేద్కర్ , బాబూ రాజేంద్ర ప్రసాద్ యొక్క నేతృత్వంలో ప్రపంచ దేశాలు తిరిగి భారత దేశానికి రాజ్యాంగం రూపొందించారు. ఈరోజు భారత దేశం విశ్వాగురువు గా రూపాంతరం చెందుతుంది. కరోనాతో ప్రపంచ దేశాలు అల్లకల్లోలం అవుతుంటే భారత దేశం కరోనాకి టీకాను కనుకొని ప్రపంచ దేశాలకు ఉత్పత్తి చేసింది. అదే విధంగా భారత దేశం 131 కోట్ల కరోనా టీకా డోసులను పూర్తి చేసుకుంది. భారత దేశం సంస్కృతి సాంప్రదాయాలు ప్రపంచ దేశాలకు మార్గదర్శకంగా నిలిచేలా యువత ముందడుగు వేయాలని ఆయన అన్నారు.
ఈ కార్యక్రమంలో మహిళ జిల్లా అధ్యక్షురాలు వేషాల సత్యవతి, జిల్లా ఓబీసీ ఉపాధ్యక్షులు పులి గుజ్జ రాజు, పట్టణ ఉపాధ్యక్షులు పడకంటి పురుషోత్తం, కోరే సుధాకర్, ఉరేటి మునిందర్, డాక్టర్ సెల్ అధ్యక్షులు కర్ర జైపాల్ రెడ్డి, కోపరేటివ్ కన్వీనర్ పరివేద మనోహర్ రెడ్డి, మీడియాసెల్ ఇన్ఛార్జిగా కనుకుంట్ల నరేష్, డాక్టర్ సెల్ నాయకుడు రేగళ్ల రవీందర్, సీనియర్ నాయకులు రేగళ్ల సదానందం, ఒకటో వార్డు కౌన్సిలర్ అభ్యర్థి గోదారి గణేష్, రేగళ్ల వంశీ, బుర రమేష్, పట్టణ మహిళా అధ్యక్షురాలు కడారి మాలతి, ఉపాధ్యక్షురాలు అంబాల పద్మ మియా, పురం స్వప్న, మహిళా కార్యదర్శులు కోరే సంధ్య, స్వరూప మరియు బిజెపి నాయకులు కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు.