రేగొండ మండల కేంద్రంలో బిఆర్ఎస్ పార్టీ నాయకులు సాంబారి సాయి కుమార్ ను ఆదివారం స్నేహ యూత్ సభ్యులు మర్యాదపూర్వకంగా కలిసారు. గత కొన్ని రోజుల క్రితం కొత్తపల్లి గోరి గ్రామంలో సాంబారి సాయి కుమార్ సహకారంతో బలగం సినిమా ప్రదర్శించారు. ఈ సందర్బంగా స్నేహ యూత్ సభ్యులు సాయి కుమార్ ని శాలువాతో ఘనంగా సన్మానించి, కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్నేహ యూత్ అద్యక్షుడు నామాల వినయ్, ఉపాధ్యక్షుడు వెంకటేష్ ఉన్నారు.