ఘనంగా డాక్టర్స్ డే వేడుకలు
చిట్యాల మండలంలో డాక్టర్స్ డే వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ మేరకు డాక్టర్లను స్థానిక ఎంపీటీసీ కట్కూరి పద్మ నరేందర్ ఘనంగా సన్మానించారు. తల్లిదండ్రులు మనకు జన్మను ఇస్తే డాక్టర్లు పునర్జన్మను ఇస్తారని ఎంపీటీసీ చెప్పారు. హాస్పటల్ సూపరింటెండెంట్ జీడి తిరుపతి, డాక్టర్లు శ్రీకాంత్, విద్య, అఖిల, ఆసుపత్రి సిబ్బంది పాల్గొన్నారు.