Nov 28, 2024, 11:11 IST/జనగాం
జనగాం
గజ్వేల్: సీపీఎం పార్టీ బహిరంగ సభను జయప్రదం చేయండి
Nov 28, 2024, 11:11 IST
సీపీఎం పార్టీ సిద్దిపేట జిల్లా మూడవ మహాసభలు డిసెంబర్ 1, 2 తేదీల్లో గజ్వేల్ పట్టణంలో జరుగుతాయని, ర్యాలీ బహిరంగ సభ ఉంటుందని సభకు ప్రజలు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొనాలని పార్టీ కార్యదర్శి వర్గ సభ్యులు సత్తిరెడ్డి గురువారం పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజా కార్మిక రైతన్న వ్యతిరేక విధానాలపై పార్టీ నిరంతరం ఉద్యమిస్తూ ప్రజల పక్షాన నిలబడి పోరాటం చేస్తుందన్నారు.