గ్రామంలో మొదలైన బతుకమ్మ వేడుకలు (వీడియో)

66చూసినవారు
డోర్నకల్ మండలం ముల్కలపల్లిలో బుధవారం రాత్రి బతుకమ్మ వేడుకలు మొదలయ్యాయి. ఆడపడుచులంతా కలిసి ఇంటివద్ద పూలను పేర్చి బతుకమ్మలను కనక దుర్గమ్మ మండపం వద్దకు తీసుకొచ్చి బతుకమ్మ పాటలకు కోలాటాలు ఆడారు. దీనితో గ్రామంలో సందడి వాతావరణం నెలకొని పండుగలా మారింది. బతుకమ్మలను డీజే చప్పుల్లతో అకేరు వద్దకు చేరుకొని ఆ బతుకమ్మలను నీళ్ళలో వదిలారు. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు, కమిటీ సభ్యులు, యువత, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్