మహబూబాబాద్ జిల్లా కురవి మండలం బంచరాయితండ గ్రామ పంచాయతీ పరిధిలో సోమవారం వనమహోత్సవం కార్యక్రమం నిర్వహించారు. అందులో భాగంగా మొక్కలు నాటే వనమహోత్సవం కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఫీల్డ్ అసిస్టెంట్ వీరన్న, బంచరాయితండ గ్రామ పంచాయతీ కార్యదర్శి రమాదేవి గ్రామ పెద్దలు మాట్లాడుతూ.. రాష్ట్ర భూభాగంలో 33% పచ్చదనం ఉండాలనే లక్ష్యంతో మొక్కలు నాటే కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని అన్నారు.