కురవి మండలంలోని బలపాల గ్రామానికి చెందిన గోల్కొండ హేమలత గత బుధవారం క్యాన్సర్ వ్యాధితో బాధపడుతూ మృతి చెందారు. గత 2 సంవత్సరాల క్రితం వారి భర్త కూడా క్యాన్సర్ బారిన పడి మృతి చెందారు. తల్లిదండ్రులు ఇద్దరూ మృతి చెందడంతో ఇద్దరు ఆడపిల్లలు అనాధలయ్యారు. సుమలత 5వ తరగతి నాగమణి 4 తరగతి చదువుతున్నారు. ఈ సందర్భంగా బలపాల వాకర్స్ సభ్యులు రూ. 20 వేలు ఆర్థిక సాయం అందించి వారి పేరు మీద బ్యాంకులో డిపాజిట్ చేశారు.