ఫెంగల్ తుఫాన్ నేపథ్యంలో చెన్నై వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తుండడంతో చెన్నై ఎయిర్ పోర్టును అధికారులు తాత్కాలికంగా మూసివేశారు. అలాగే శంషాబాద్ నుంచి రావాల్సిన శంషాబాద్-చెన్నై, శంషాబాద్-తిరుపతి విమానాలను రద్దు చేశారు. ప్రతికూల వాతావరణం వల్ల దాదాపు పది విమానాలు రద్దు చేసినట్లు ఎయిర్ పోర్ట్ అధికారులు తెలిపారు. ముంబై, త్రిపుర వెళ్లే విమాన సర్వీసులు కూడా రద్దయ్యాయి.