సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా రాష్ట్రీయ ఏక్తా దివస్ 2014 నుంచి భారతజాతి జరుపుకుంటుంది. దేశ ప్రజలందరిలో ఐక్యత, సమగ్రత, భద్రతా భావాలు పెంపొందించే క్రమంలో సర్దార్ పటేల్ జయంతి ని ఏక్తా దివస్ గా జరుపుకుంటారు. తన నాయకత్వ పటిమ తో బార్డోలీ ఉద్యమం ముందుకు నడిపించి బార్డోలీ వీరుడిగా, సర్దార్ గా కీర్తి గడించారు పటేల్. గాంధీ నాయకత్వంలో అనేక ఉద్యమాల్లో పాల్గొన్నారు. మొదటి ఉప ప్రధానిగా, హోమ్ మినిస్టర్ గా, రాజ్యాంగ ప్రాథమిక హక్కుల కమిటీ చైర్మన్ గా తమ సేవలు అందించారు. వల్లభాయ్ పటేల్. సంస్థానాల విలీనం వంటి క్లిష్ట సమస్యలు పరిష్కరించి ఉక్కు మనిషిగా పేరుపొందారు.
పిల్లల్లో బాల్య దశ నుంచే జాతీయ భావాలు, ఐక్యత సమగ్రత పెంపొందించడానికి పాఠశాలలో ఈరోజు ఉపాధ్యాయులు ఏక్తా దివస్ ప్రతిజ్ఞ చేయించారు. కోవిద్ నిబంధనల వలన విద్యార్థులు వారి వారి నివాస ప్రాంతం నుంచే ప్రతిజ్ఞ చేశారు. కొన్ని చోట్ల మాత్రం తక్కువ మంది విద్యార్థులతో ఉపాధ్యాయులు ప్రతిజ్ఞ చేయించారు. కరుణ సెకండ్ వేవ్ వార్తలు వస్తుండటంతో పలు జాగ్రత్తలు సూచనలు పిల్లలకు ఉపాధ్యాయులు చెప్పారు.