డోర్నకల్ మండలం షాపుల తండాలో శుక్రవారం అర్ధ రాత్రి విద్యుత్ మోటార్లు చోరీ జరిగింది. గ్రామానికి చెందిన నలుగురి రైతుల వ్యవసాయ విద్యుత్ మోటార్లు శుక్రవారం రాత్రి గుర్తుతెలియని దుండగులు ఎత్తుకెళ్లారు. బాధిత రైతులు శనివారం ఉదయం పోలం వద్దకు వెళ్లి చూడగా తమ వ్యవసాయ మోటర్లు కనిపించకపోవడంతో ఆవేదన వ్యక్తం చేశారు. రైతులు డోర్నకల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.