ఇందిరా గాంధీ కుటుంబం పై బీజేపీ కుట్రలు చేస్తుంది: సీతక్క
మహబూబాబాద్ జిల్లా గంగారాం మండలంలో బుధవారం మంత్రి సీతక్క పర్యటించి సుమారు 40 కోట్ల రూపాయలతో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. దేశ కోసం పాటుపడిన రాహుల్ గాంధీని చంపుతామని బీజేపీ ఎమ్మెల్యే మాట్లాడటం శోచనీయం అని, అనుచిత వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్యే పై బీజేపీ చర్యలు తీసుకోవాలని, రాహుల్ గాంధీకి ప్రధాని మోడీ వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.