ఏపీలోని తిరుమల శ్రీవారి అన్నప్రసాదం ట్రస్టుకు ముంబైకి చెందిన ఓ భక్తుడు రూ.11 కోట్ల భారీ విరాళం ఇచ్చారు. యూనో ట్రస్టు పేరుతో ఈ విరాళాన్ని అందించారు. ఈ మేరకు సోమవారం టీటీడీ అదనపు ఈవో సీహెచ్ వెంకయ్య చౌదరికి భక్తుడు తుషార్ కుమార్ విరాళం చెక్కులు అందజేశారు. ఈ మొత్తాన్ని శ్రీవారి అన్నప్రసాదం సేవకు వినియోగించాలని కోరారు. దీనిని అందజేసిన భక్తుడు తుషార్ కుమార్ను అదనపు ఈవో అభినందించారు.