హన్మకొండ: హెచ్ఐవి ఎయిడ్స్ పై అవగాహన కార్యక్రమం
పోలీసు అమరవీరుల సంస్మరణ వారోత్సవాల సందర్భంగా హన్మకొండ పోలీసు హెడ్ క్వార్టర్స్ లో ఆదివారం ఉదయం వరంగల్ ట్రైసిటీ సైకిల్ వాకర్స్, మట్టెవాడ సిఐ గోపి ఆధ్వర్యంలో జరిగిన సైకిల్ ర్యాలీ సందర్భంగా హెచ్. ఐ. వి/ ఎయిడ్స్ పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టిబి హాస్పిటల్ కౌన్సిలర్ రాపర్తి సురేష్, వర్దన్నపేట కౌన్సిలర్ నీలారపు అశోక్ కుమార్, మహిళ మండలి ప్రాజెక్ట్ మేనేజర్ ఈశ్వర్, తదితరులు పాల్గొన్నారు.