మట్టి గణపతి విగ్రహాలను పంపిణీ చేసిన కార్పొరేటర్
హన్మకొండ 57వ డివిజన్ పరిధిలోని పలువురు మహిళలకు స్థానిక కార్పొరేటర్ నల్ల స్వరూపారాణి సుధాకర్ రెడ్డి మట్టి గణపతి విగ్రహాలను పంపిణీ చేశారు. డివిజన్ వ్యాప్తంగా వినాయక చవితి వేడుకలను ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలన్నారు. మట్టి గణపతి విగ్రహాలను ప్రతిష్టించి పర్యావరణ పరిరక్షణకు తోడ్పాటును అందించాలని పిలుపునిచ్చారు.