హన్మకొండ: 169 మంది డీఎస్సీ అభ్యర్థులకు ఆర్టీసీ బస్సు ఫ్రీ

53చూసినవారు
హన్మకొండ: 169 మంది డీఎస్సీ అభ్యర్థులకు ఆర్టీసీ బస్సు ఫ్రీ
రాష్ట్ర వ్యాప్తంగా డిఎస్సీ 2024లో ఎంపికైన అభ్యర్థులకు నియామక పత్రాలను అందించేందుకు గాను బుధవారం హైద్రాబాదు ఎల్బీ స్టేడియంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో హన్మకొండ జిల్లా నుండి ఎంపికైన 169 మంది అభ్యర్ధులకు ఏర్పాటు చేసిన 4 ఆర్‌టిసి బస్సులను అదనపు కలెక్టర్‌ వెంకటరెడ్డి కలెక్టరేట్‌ ఆవరణలో జెండా ఊపి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి కె. వాసంతి, విద్యాశాఖ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్