రూ. 22, 145 విలువగల పొగాకు ఉత్పత్తులు స్వాధీనం
హనుమకొండ భీంపల్లి గ్రామంలో సోమవారం రాత్రి టాస్క్ పోర్స్ పోలీసులు దాడి చేసి రూ. 22, 145 విలువగల గుట్కా ప్యాకెట్లు, అంబర్ పొట్లాలు స్వాధీనం చేసుకొన్నారు. గుట్కాను అక్రమంగా నిల్వ చేసి విక్రయిస్తున్న యెలుగం రాజు, నూక భాస్కర్ అనే ఇద్దరిని అరెస్టు చేసి కేసు నమోదుకు కమలాపూర్ పోలీసులకు అప్పగించినట్లు టాస్క్ ఫోర్స్ ఏసీపీ మధుసూదన్ తెలిపారు.