

ఐనవోలు మల్లికార్జున స్వామి హుండీ లెక్కింపు
శ్రీ మల్లికార్జున స్వామి వారి హుండీ శుక్రవారం లెక్కించారు. హుండీ ఆదాయం 91 రోజులకు రూ. 31,59,335/- వివిధ అర్జీత సేవ టిక్కెట్ల ద్వారా రూ. 53,74,034/- ఆదాయం. మొత్తం రూ. 85, 33, 369/- ఆదాయం వచ్చింది. హుండీలో వచ్చిన మిశ్రమ వెండి బంగారం సీల్ చేసి తిరిగి హుండీలో భద్రపరచడం జరిగింది. ఈ హుండీ లెక్కింపు దేవాదాయ ధర్మాదాయ శాఖ వరంగల్ డివిజన్ పరిశీలకులు డీ అనిల్ కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది