ఏబీవీ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమం

54చూసినవారు
ఏబీవీ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమం
వరంగల్ జిల్లా కేంద్రంలోని ఏబీవీ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఎన్ఎస్ఎస్ విద్యార్థులు కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడా మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో సోమవారం స్వచ్ఛ కార్యక్రమం నిర్వహించారు. కళాశాల నుంచి ర్యాలీగా ఎల్ ఐసీ ఆఫీసు ఎదురుగా ఉన్న బాబు జగ్జీవన్ రామ్ విగ్రహం వద్దకు చేరుకున్నారు. పరిసర ప్రాంతాలను శుభ్రం చేశారు. కార్యక్రమంలో ఎన్ ఎస్ఎస్ విభాగం ప్రోగ్రాం ఆఫీసర్ శ్రీనివాస్, అధ్యాపకుడు నరసింహులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్