జనగామ జిల్లాలో ప్రభుత్వ పాఠశాలల్లోని మధ్యాహ్న భోజన వంట కార్మికులు ఆందోళన చేపట్టారు. తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ మంగళవారం జనగామ కలెక్టరేట్ ఎదుట భారత రాష్ట్ర ట్రేడ్ యూనియన్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. వెంటనే పెండింగ్ వేతనాలు, ప్రభుత్వం తమకు ఇస్తామన్న హామీ మేరకు నెలకు పదివేల రూపాయల వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. అనంతరం జిల్లా కలెక్టర్ కు వినతి పత్రం అందజేశారు.