గత బీఆర్ఎస్ ప్రభుత్వం గ్రంధాలయాలను పట్టించుకోలేదని జనగామ జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మెన్ మారుజోడు రాంబాబు అన్నారు. సోమవారం జనగాం జిల్లా స్టేషన్ ఘనపూర్ డివిజన్ కేంద్రం శివునిపల్లిలోని శాఖాగ్రంధాలయాన్ని ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా గ్రంధాలయంలోని రిజిస్టర్ లను, పోటీ పరీక్షల పుస్తకాలు, నవలలు, ఆధ్యాత్మిక పుస్తకాలను పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడూతూ గత బీఆర్ఎస్ ప్రభుత్వం గ్రంధాలయాలను పట్టించుకోలేదన్నారు.