భారత ఎన్నికల కమిషన్ ఆదేశాల ప్రకారం జనగాం, ఘనపూర్ (స్టేషన్), పాలకుర్తి నియోజకవర్గాల్లో సిస్టమాటిక్ ఓటర్స్ ఎడ్యుకేషన్ అండ్ ఎలెక్టర్ల్ పార్టిసిపేషన్ కార్యక్రమాలు కొనసాగుతున్నాయని జనగాం జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ తెలిపారు. ఎన్నికల వ్యవస్థలో ప్రజలు చురుకుగా పాల్గొనడం కోసం అవగాహన కల్పించడమే కార్యక్రమ ప్రధాన ఉద్దేశమన్నారు. సోమవారం నియోజకవర్గాలలో ఓటరు నమోదు శిబిరాలు నిర్వహించిన్నట్లు తెలిపారు.