Nov 28, 2024, 12:11 IST/
TG: రుణమాఫీ కానీ రైతులకు గుడ్న్యూస్!
Nov 28, 2024, 12:11 IST
తెలంగాణ వ్యాప్తంగా నిర్వహించనున్న విజయోత్సవాల్లో భాగంగా రాష్ట్ర సర్కార్ రైతులకు గుడ్న్యూస్ చెప్పనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే రూ.2 లక్షల వరకు రూ.18 వేల కోట్లను ప్రభుత్వం రుణమాఫీ చేసింది. అయితే కొందరికి రేషన్ కార్డులు లేకపోవడం, ఆధార్, బ్యాంకు ఖాతాల్లో పేర్లు, నంబర్లు తప్పుగా ఉండటం వంటి కారణాలతో 3 లక్షల పై చిలుకు రైతులకు మాఫీ వర్తించలేదు. దీనిపై ఈ నెల 30న పాలమూరులో జరిగే రైతుసభలో సీఎం కీలక ప్రకటన చేసే అవకాశం ఉంది.