రోడ్డు ప్రమాదంలో కాంగ్రెస్ నాయకుడి మృతి
కొమురవెల్లి మండలంలో ఆదివారం రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందిన విషయం తెలిసిందే. వివరాల్లోకి వెళ్తే.. చెర్యాల మండలంలోని గురువన్నపేట గ్రామానికి చెందిన అందే వీరేశం(36) శుభకార్యానికి వెళ్లొస్తానని బయటికి వెళ్లాడు. శనిగరం గ్రామానికి రాజీవ్ రహదారి గుండా బైక్పై వెళ్తుండగా ముందు వెళ్తున్న కారు సడన్ బ్రేక్ వేయడంతో వీరేశం వేగంగా వచ్చి కారును ఢీకొన్నాడు. ఈ ప్రమాదంలో అతను అక్కడికక్కడే మరణించాడు.