కురవి: బతుకమ్మ ఆడిన మాజీ మంత్రి
కురవి మండలంలోని పాఠశాల మైదానంలో ఆదివారం రాత్రి బతుకమ్మ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ పాల్గొని, బతుకమ్మల చుట్టూ తిరుగుతూ.. సందడి చేశారు. ఐదవ రోజు సందర్బంగా పెద్ద ఎత్తున మహిళలు తరలి వచ్చి బతుకమ్మలు ఆడారు. దీనితో మండలంలో సందడి వాతావరణం నెలకొని జనసంద్రంలా మారింది.