సుందర వనంగా కంపోస్ట్ యార్డ్ షెడ్డు

1652చూసినవారు
సుందర వనంగా కంపోస్ట్ యార్డ్ షెడ్డు
మహబూబాబాద్ జిల్లా కురవి మండలంలోని లింగ్యాతండా(బి) గ్రామపంచాయితి పరిధిలో స్థానిక సర్పంచ్ గుగులోతు రాంలాల్ నాయక్ ఆధ్వర్యంలో తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ప్రతి గ్రామపంచాయితీలో కంపోస్ట్ షెడ్ నిర్మాణం పనులు మంజూరైన కంపోస్ట్ షెడ్ కు సంబందించిన పెంటింగ్ మంగళవారం పూర్తయింది. మూడు రోజులుగా నలుగురు పెయింటర్ చాలా సుందరంగా వివిధ రంగులతో అలంకరించడంతో గ్రామపంచాయితి ప్రజలు అందరు ఆసక్తిగా చూస్తున్నారు. మండలంలోనే మోడల్ కంపోస్ట్ షెడ్ గా తయారు చేయడం జరిగిందన్నారు. ఈ సందర్భంగా సర్పంచ్ పెయింటర్లను అభినందించారు.

సంబంధిత పోస్ట్