దారుణం.. ఆస్తి వివాదంలో కొడుకును హత్య చేయించిన తల్లి

63చూసినవారు
దారుణం.. ఆస్తి వివాదంలో కొడుకును హత్య చేయించిన తల్లి
AP: పల్నాడు జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. క్రోసూరు మండలం హసనాబాద్‌‌కు చెందిన మహబూబ్‌ బాషా(28)పై గురువారం తన తల్లి మున్నీబీ దాడి చేయించింది. ఈ దాడిలో మహబూబ్ బాషాకు తీవ్రగాయాలు అయ్యాయి. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రుడ్ని ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ మరణించాడు. అయితే గత కొంతకాలంగా తల్లీకొడుకులకు ఆస్తి వివాదాలు ఉన్నట్లు, ఈ వివాదంలో మున్నీబీ కొడుకుపై దాడి చేయించినట్లు పోలీసులు వెల్లడించారు.

సంబంధిత పోస్ట్